Friday, 2 October 2009

పదవి లేని పాడుబతుకు పగ వాడికి కూడ వద్దు

ఈ గాంధి జయంతి రోజున మన నేతనలను(అధికార మరియు ప్రతిపక్షాల) పలకరిస్తే ఇదే పరిస్థితి. ఏమి చెప్పమంటారు జాతిపిత కష్టాలు జాతిపితవి, మన నేతల కష్టాలు వాళ్లవి.
పదవి దీపము ఉన్నగానే వారసుడిని నిలబెట్టుకోవాలి. కనీసము నాలుగు రాళ్ళు(బినామి ఆస్తులు, కుల గజ్జి, విధేయులు మరియు భజన పరులు) వెనకేసుకుంటె అదైన వారసులకి మిగిలిద్ది, ఇదియె మన రాజకీయ నాయకుల "ఆపేక్ష" సిద్దాంతం.

Thursday, 17 September 2009

ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును

హైదరాబాద్ లొ ఈ మద్య ఒక కొత్త మాల్ ని తెరిచారు. ఇచ్చట పెళ్లి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటన ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళయిన కొత్తలో సినిమాలో లాగానే) కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవేమిటంటే.

* అమ్మాయి మా మాల్ కి ఒక్కసారే అనుమతించబడును.
* పెళ్లి కొడుకులని వారి వారి రుచులు, అభిరుచులు మరియు హోదాలకి తగ్గట్టుగా వివిధ అంతస్తులలో వర్గీకరించ బడిరి. ఎ అంతస్తు లో పెళ్లి కొడుకైన మీరు ఎన్ను కోవచ్చు. ఆ అంతస్తు లో నచ్చకపోతే మీరు మరో అంతస్తుకి వెళ్ళ వచ్చు, కాని మీరు వెనక్కి రావటానికి ఆస్కారము లేదు, చివరి అంతస్తు నుండి బయటకి పోవటము తప్ప.

ఇదేదో బాగావుంది అని ఒక అమ్మాయి ఈ మాల్ కి వచ్చింది. అంతస్తుల వారీగా ఈ సూచనలు వున్నాయి.

మొదటి అంతస్తు: ఈ పెళ్లి కొడుకులకు ఉద్యోగాలు వున్నాయి, భార్య ని బాగా చూసుకుంటాడు.
రెండవ అంతస్తు: ఈ పెళ్లి కొడుకులకు ఉద్యోగాలు వున్నాయి, భార్య ని బాగా చూసుకుంటాడు, పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్తు: ఈ పెళ్లి కొడుకులకు ఉద్యోగాలు వున్నాయి, భార్య ని బాగా చూసుకుంటాడు, పిల్లలను ప్రేమిస్తారు మరీయు వీళ్ళు చాల అందగాళ్ళు.

అద్బుతం అని అనుకుంటూ ఇక పైకి వెళ్ళితే ఎలా వుంటుందో అనుకుంటూ పైకి వెళ్ళింది
నాలుగవ అంతస్తు: ఈ పెళ్లి కొడుకులకు ఉద్యోగాలు వున్నాయి, భార్య ని బాగా చూసుకుంటాడు, పిల్లలను ప్రేమిస్తారు, వీళ్ళు చాల అందగాళ్ళు మరీయు ఇంటిపని వంటపని సహాయ లో సహాయ పడతారు.

ఆహ!! ఈ మాల్ చాలా బాగుందే! ఇక పై అంతస్తుల లో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది (ఐదవ అంతస్తులో ఎలాంటి వరుడు వుంటాడో!! అని వూహించుకొని సంబర పడింది). అలా తరువాతి అంతస్తుకి వెళ్తుంది.
ఐదవ అంతస్తు: అక్కడి సూచనా ఇలా వుండి...
"మీ తో కలిపి ఈ అంతస్తు లో చేరుకున్న వారి సంఖ్య ఒక లక్ష యాబై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు. ఈ అంతస్తులో పెళ్లి కొడుకులు లేరు, ఆడవాళ్ళను మెప్పించడం అసాద్యం.

ఆపరేషన్ ఫర్ ముఖ్యమంత్రి

రాష్ట్రము లో పంచ భూతాలను కొల్ల గొట్టే ముఖ్యమంత్రి ని నియమించండి...
వరుణ దేవున్ని రాజకీయాలకు వాడుకునే ముఖ్యమంత్రి కావలయును...
బియ్యపు గింజలకు రాజీవ్ పేరు, కందిపప్పు కి ఇందిరమ్మ పేరు, పామాయిల్ కు రాహుల్ పేరు, సారాయి కి సోనియా పేరు పెట్టె ముఖ్యమంత్రి కావలయును...
అసెంబ్లీ లో ప్రతిపక్ష్యలను ఆడుకుంటూ, నేనే గొప్ప  అంటూ విర్ర వీగే ముఖ్య మంత్రి కావలయును ..
ఆపరేషన్ ఆకర్ష పధకాలు పెట్టి ప్రతిపక్షాలను కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కావలయును...
నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించలేక, దొడ్డు బియ్యం తినండి, శనగ పప్పు, బఠాణీ లు తినండి అంటూ ఎకసేక్కలు ఆడే ముఖ్యమంత్రి కావలయును...
కాలువలు తోవ్వుతూ కాటన్ దొరతో పోల్చుకునే ముఖ్యమంత్రి కావలయును...
పత్రికలపై, ప్రతిపక్షాలపై, అయితే ఎంటంట? అంటూ భుకాయించే ముఖ్యమంత్రి కావలయును...
రైతు రాజ్యం తెస్తానని, ఆత్మ హత్యలు ఇక వుండవని రైతుల్ని మోసం చేసే విధం గా రైతు వేషం వేసే ముఖ్యమంత్రి కావలయును...
పైన వున్న అన్ని ఎవరికైనా వున్నట్లయితే మీ resume ని soniyagandhi@aicc.com కి పంపగలరు ...
--
Thanks & Regards,
ఆపరేషన్ ఫర్ ముఖ్యమంత్రి ,
ఆంధ్ర ప్రదేశ్ .